
– ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి.
– విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది కృషి చేయాలి..
– సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి
నవతెలంగాణ – రాయపోల్
విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో చదివితే జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాలలో విద్యాబోధన అందించడం జరుగుతుందని గురుకులాలలో ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండలం లింగరాజు పల్లి మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను తనిఖ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని విద్యార్థులు మంచి అవకాశాన్ని వినియోగించుకొని చదువులో ముందుండాలని జిల్లా అన్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారి నుంచి అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్ పూర్తిగా శిధిలావస్థకు చేరిందని కొత్త భవనం కావాలని చెప్పడంతో వెంటనే ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే లైబ్రరీ ఇన్చార్జితో పాటు క్రీడా సామాగ్రి కావాలని విద్యార్థులు విన్నవించారు. కలెక్టర్ స్పందిస్తూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులందరూ క్రమశిక్షణ పట్టుదలతో చదువుకొని గురుకుల పాఠశాలకు మంచి పేరు తేవాలని కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ సూచించారు. పదవ తరగతి పరీక్షల్లో పదికి పది మార్కులు సాధించేందుకు విద్యార్థులు ఇప్పటి నుంచే కష్టపడి చదువుకోవాలని పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి వారిని మంచి నైపుణ్యంగా తీర్చిదిద్ది భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు చదువులో ప్రతిభ చూపాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో నేడు ఎంతోమంది విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ తాహాసిల్దార్ సుజాత,ఎంపీడీవో వెంకటలక్ష్మి, మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వప్న, ఎంపీవో గఫూర్ ఖాద్రీ, పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.