శాంతియుత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలి

Vinayaka Chavithi festivals should be held in a peaceful atmosphere– గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి
నవతెలంగాణ – రాయపోల్
గణేష్ మండపాల నిర్వాహకులు వినాయక చవితి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి అన్నారు. మంగళవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాల నిర్వహకులు ఆన్లైన్ లింక్ ద్వారా విగ్రహాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోని అనుమతి తీసుకోవాలన్నారు.ఆన్లైన్లో అనుమతి తీసుకుంటే భద్రత కల్పించడం సులువు అవుతుందన్నారు.భిన్నత్వంలో ఏకత్వంలో పండగలు జరుపుకోవడం మన సంప్రదాయం. గణేష్ మండపాల నిర్వహకులు తాము ఏర్పాటు చేసే గణేష్ ప్రతిమ ఎత్తు, ఏర్పాటు చేస్తున్న ప్రదేశం,నిమజ్జనం తేదీ,ప్రదేశం మొదలైన సమాచారంతో తెలంగాణ పోలీస్ శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ ప్రోటోకాల్ వెబ్సైట్ https://policeportal.tspolice.gov.in/indxNew1.htm ద్వారా మండపాల నిర్వహకులు పూర్తి వివరాలను నమోదుచేసుకోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.గణేష్ మండపాలను ఎవరికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి.గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి. నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు,మండపాల బాధ్యత వహించే వారి వివరాలు,ఫోన్ నెంబర్లతో కూడిన ఫ్లెక్సీలను మండపంలో ఏర్పాటు చేయాలి. వృద్ధులు, చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా తక్కువ శబ్దకాలుష్యంతో బాక్స్ టైప్  స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి.మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేలను ఏర్పాటు చేయరాదు. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి.గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం,పేకాట అడటం,లక్కీ డ్రాలు నిర్వహించడం,అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు,అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం,పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు,ప్లాస్టిక్ సంచులు,వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100 గాని లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెంబర్ 8712667100, గజ్వేల్ ఏసిపి 8712667330 స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తొగుట సీఐ షేక్ లతీఫ్, దౌల్తాబాద్ తహసిల్దార్ సుజాత, ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్, ఎంపీడీవో వెంకటలక్ష్మి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love