
నవతెలంగాణ – సూర్యాపేట రూరల్
అంటు వ్యాధులు, విష జ్వరాల వారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ని ప్రకటించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి డిమాండ్ చేశారు. అంటు వ్యాధులు, విషజ్వరాలు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్న వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని గత రెండు, మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాల మూలంగా ప్రజలుటైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విష జ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతుంటే వాటిని పరిష్కరించవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులు మందులు, డాక్టర్ల, సిబ్బంది,కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రతి ఇంట్లోఒకరు జ్వరంతో అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలు, అంటూ వ్యాధుల బారి నుండి ప్రజా ఆరోగ్యాన్ని రక్షించడంలో వైద్య, ఆరోగ్యశాఖ మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. అంటూ వ్యాధులు,విష జ్వరాలు ప్రబలకుండా ఉన్నందుకు అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య చర్యలు వేగవంతం చేసి, దోమల నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. పి.హెచ్.సి సెంటర్ లలో 24 గంటలు వైద్యం అందేలా చూడాలన్నారు. అన్ని గ్రామాలలోవైద్య, ఆరోగ్య సిబ్బందిని పంపించి సంచారా వైద్య బృందాల ద్వారా ప్రజలందరికీ వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అన్ని గ్రామాలకు పారిశుద్ధ్య నిధులు కేటాయించి వ్యాధులు ప్రబలకుండా ప్రతిష్ట చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.ఖాళీగా ఉన్న డాక్టర్, స్టాఫ్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రులలో, పి హెచ్ సి సెంటర్లలో డెంగ్యూ నిర్ధారణ కిట్లను ఏర్పాటు చేయాలని కోరారు. డెంగ్యూ వల్ల మృతి చెందిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా పార్టీ జెండాను సిపిఎం సీనియర్ నాయకులు జుట్టు కొండ వీరయ్య ఎగరవేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులునగారపు పాండుఅధ్యక్షతన జరిగిన ఈ విస్తృతస్థాయి సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులునెమ్మాది వెంకటేశ్వర్లు,కోలిశెట్టి యాదగిరి,పారేపల్లి శేఖర్ రావు,మే ద ర మెట్ల వెంకటేశ్వరరావు, మట్టిపల్లి సైదులు, చెరుకు ఏకలక్ష్మి, కోటగోపి తదితరులు పాల్గొన్నారు.