
జమ్మికుంట పట్టణంలోని పెసరబండ 467 సర్వేనెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని కొంతమంది భూ ఆక్రమణదారులు కబ్జా చేశారని ఆరోపిస్తూ దానిని వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం ఐదవ రోజుకు చేరుకున్నాయి. ఈ రిలే దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు వాసాల రామస్వామి రిలే నిరాహార దీక్ష చేస్తున్న శిబిరానికి వెళ్లి తన సంపూర్ణ మద్దతును తెలిపారు. ఈ రిలే నిరాహార దీక్షలో సీనియర్ సామాజిక కార్యకర్త మహేంద్ర నాథ్ గౌడ్ ,కాంగ్రెస్ నాయకుడు అక్బర్ పాషా తదితరులు ఉన్నారు.