– అర్హత ఉన్న లిస్ట్ లో పేర్లు లేవని రైతుల ఆందోళన..
– ఫిర్యాదులతో వెలుగులోకి వస్తున్న అక్రమాలు..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణామాఫీ సవాలుగా తీసుకొని అమలు చేస్తుండగా జిల్లాలో అధికరుల తప్పిదంతో సహకార సంఘాలలో రుణాలు తీసుకున్న రైతులకు శాపంగా మారాయి.జిల్లాలో పలు సహకార సంఘాల్లో రైతులు రుణాలు తీసుకొనప్పట్టికి రుణాలు తీసుకున్నట్లుగా వెలుగులోకి వస్తున్నాయి. దీనితో రైతులు ఆందోళన చెందుతుండగా న్యాయం కోసం ఆఫీసర్ల చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు.రైతాంగం ఎన్నో ఆశలతో సహకార రుణాల కోసం ప్రాధమిక సహకార సంఘాలలో చేరితే రైతులకు టోకరా ఇస్తున్న పలు సహకార సంఘాల అక్రమాలు తెరపైకి వస్తున్నాయి.
రైతులను బురిడి కొట్టిన సహకార సంఘాలు…
రైతు రుణామాఫీతో గతంలో జరిగిన ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నెలకొన్న అక్రమాలు ఒక్కొక్కట్టిగా తెర పైకి వస్తున్నాయి. జిల్లాలో పలు సహకార సంఘాల్లో రైతులు రుణాలు తీసుకోక పోయిన రుణాలు తీసుకున్నట్లు తెలుతున్నాయి. ఈ పరిమాణాలు కొత్తగా తీసుకున్న రుణామాఫీ జరగకపోవడంతో రైతలు కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. తుంగతుర్తి నియోజక వర్గం తిరుమలగిరి ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘంలో భారీ మొత్తంలో అక్రమాలు జరిగినట్లు తేలింది. ఈ సొసైటీలో దాదాపు 48 మంది రైతుల పేరు మీద సొసైటీలోనే సభ్యులు రుణాలు తీసుకుని బురిడి కొట్టించాయి. ఇటీవల జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కు సంబందిత రైతులు ఫిర్యాదు చేయడంతో సొసైటీ లో జరిగిన అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మునగాల మండలం రేపల్లె సహకార సంఘం సొసైటీ లో సైతం ఇదే తరహాలో రైతుల పేరుపై కొంతమంది సభ్యులు రుణాలు తీసుకొని రైతులను మోసం చేయడంతో సొసైటీ లోని రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
అధికారుల నిర్లక్ష్యం..
ప్రభుత్వం మంచి సంకల్పంతో రైతు రుణామాఫీ చేస్తుంటే సూర్యాపేట జిల్లాలో రుణాల మాఫీకి అధికారుల అలసత్వం కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఒకవైపు పలు సహకా సంఘాల్లో రైతుల పేరుతో అక్రమంగా లోన్లు లేపడం వెనుక అధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండగా మరోవైపు అధికారులు స్పష్టమైన డేటా పంపని కారణంగా రుణామాఫీకి ఆటంకం కలుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి అధికారులు రైతుల పేరుతో చెల్లించిన రుణాల స్థానంలోనే కొత్త రుణాలు తీసుకోవడంతో తాజాగా అమలవుతున్న రుణామాఫీలో రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నది. రైతులు రుణం తీసుకొనప్పట్టికి రెండేసి బ్యాంకులలో రుణాలు తీసుకున్నట్లు తాజా రిపోర్టులలో వస్తుండడంతో రైతులకు రెండు లక్షల రుణామాఫీ అమలులో తీవ్రమైన నష్టం అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా అన్నీ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవ సహకార కేంద్రాలు, కేంద్ర సహకార బ్యాంక్ శాఖలో సమగ్రంగా విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
ఎంక్వైరీ చేస్తున్నాం..సర్యాపేట డి సి ఓ జిల్లా అధికారి పద్మ,
రైతులు రుణాలు తీసుకోకున్న తీసుకున్నట్లు కొంతమంది రైతులు ఫిర్యాదులు చేశారు. సొసైటీ లలో జరిగిన అక్రమాలపై ఎంక్వైరీ చేస్తున్నాం. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటాం.
రుణం తీసుకోన్నట్లు రిపోర్ట్ లో వస్తుంది..శ్రీనివాసులు, తాటికొండ గ్రామం, తిరుమలగిరి మండలం..
నేను సహకార సొసైటీ లో ఎలాంటి రుణం తీసుకోకున్న రూ.50 వేలు తీసుకున్నట్లు రిపోర్ట్ లలో వస్తుంది. ఇప్పుడు కొత్తగా అప్పు కోసం వెళితే లోన తీసుకున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు.