జోస్ అలుక్కాస్ సమాజ సేవలు అభినందనీయమన్న మేయర్

Mayor Jose Alukkas commended for his community service– సహృదయంతో  సేవా కార్యక్రమాలు 
– నగర మేయర్ దండు నీతు కిరణ్  
– మేయర్ చేతుల మీదుగా ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ బోధన సామాగ్రి అందజేత    
 నవతెలంగాణ – కంఠేశ్వర్ 
సువర్ణ వజ్రాభరణాలవ్యాపర రంగంలో అగ్రగామి ఉన్న జోస్ అలుక్కాస్ జువెలరీ సంస్థ ప్రభుత్వ పాఠశాలకు చేయూతను అందించడం అభినందనీయమని నగర మేయర్ దండు నీతూ కిరణ్ అన్నారు. ఆదివారం జోస్ అలుక్కాస్ జువెలరీ షోరూంలో సి ఎస్ ఆర్ ఫండ్ ద్వారా ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ బోధన సామాగ్రి అందజేత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నగర మేయర్ దండు నీతూ కిరణ్ మాట్లాడుతూ జోస్ అలుక్కాస్  60 వ వార్షికోత్సాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలకు సిఎస్ఆర్ పండ్ ద్వారా వసతులు కల్పిస్తుందన్నారు. ఖలీల్ వాడి ప్రభుత్వ పాఠశాలకు రూ. 2.80 లక్షల విలువచేసే డిజిటల్ టీవీలు, సీసీ కెమెర సిస్టం, ఫర్నిచర్ తదితర వసతులు అందజేశారని వివరించారు. అలాగే జండాగల్లి ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు రూ. ఒక లక్ష 92 వేల రూపాయల వ్యయంతో డిజిటల్ స్మార్ట్ టీవీ, మైక్ సెట్, మినరల్ వాటర్ ప్లాంట్, బుక్ సెల్ఫ్ అందజేయడం జరిగిందన్నారు. దీంతో నిరుపేద విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. సహకారం అందించిన సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయా పాఠశాల హెడ్మాస్టర్లకు సిఎస్ఆర్ పండ్  చెక్కులను నగర మేయర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ధనీష్, అసిస్టెంట్ మేనేజర్ సజయ్, అకౌంట్స్ మేనేజర్ సజేష్, ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్లు రాంచందర్ గైక్వాడ్, ాసుదేవరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love