రండి.. స్వచ్ఛందంగా సెల్ఫీ దిగి వెళ్ళండి

నవతెలంగాణ – రాయపర్తి : స్థానిక ప్రజలు, ప్రయాణికులు బస్టాండుకు విచ్చేసి స్వచ్ఛత హి సేవ సెల్ఫీ పాయింట్ వద్ద ఫోటో దిగి వెళ్ళండి అని తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ కిషన్ అన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనడానికి ఇలాంటి వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన నైతిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ కూచన ప్రకాష్, గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు బత్తుల నర్సయ్య, కార్యదర్శులు వినోద్ కుమార్, భూక్య మహేందర్, పెంచాల విజేందర్, రాకేష్, శేఖర్, సుమలత, లక్ష్మి, శాంతిరాజు, అనిల్, సంతోష్, అభిలాష్, తిరుపతి, సుధాకర్, రాజేందర్ రాజబాబు, అంబేద్కర్, పవన్ సాగర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love