- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. రూ.60 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఓ అల్లుడు తన తమ్ముడితో కలిసి అత్తను చంపించాడు. బాధితురాలు రామమ్మ పేరుపై SBI, పోస్టాఫీసులో భారీ మొత్తంలో పాలసీలు ఉన్నాయి. నిందితుడు పౌల్ట్రీ ఫామ్‌లో రూ.22 లక్షలు నష్టపోవడంతో రామమ్మ ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు.
- Advertisement -