నేటినుంచి ‘ఎస్‌ఏ-1’ పరీక్షలు

నవతెలంగాణ – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి సమ్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ-1) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందుకు సంబంధించి అకడమిక్‌ క్యాలెండర్‌లోనూ ఎస్‌ఏ-1 పరీక్షల నిర్వహణ వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ రెండున జవాబుపత్రాల మూల్యాంకనం చేసి ఫలితాలను ప్రకటించాలని విద్యాశాఖ షెడ్యూల్‌ను రూపొందించింది. అదేనెల ఐదున విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయాలని తెలిపింది. అదేనెల 16న తల్లిదండ్రులు, టీచర్ల సమావేశాన్ని నిర్వహించాలనీ, విద్యార్థుల మార్కులు, వారి ప్రతిభపై చర్చించాలని కోరింది.

Spread the love