ఐడీబీఐ బ్యాంక్‌ ‘విజిలెన్స్‌ అవర్‌నెస్‌’ వాకథాన్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌
అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3వరకు జరగనున్న కానున్న విజిలెన్స్‌ అవర్‌నెస్‌ వారోత్సవాల సందర్బంగా ఐడీబీఐ బ్యాంక్‌ జోనల్‌ ఆఫీసు ఉద్యోగులు హైదరాబాద్‌లో వాకథాన్‌ను నిర్వహించింది. అవినీతిరహిత సొసైటీపై అవగాహన పెంచడానికి ఎల్‌బీ స్టేడియం చుట్టూ బుధవారం ఈ వాకథాన్‌ జరిగింది. ప్రజలు అన్ని వేళల ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా జోనల్‌ హెడ్‌ అండ్‌ సీజీఎం శరత్‌ కుమార్‌ కామత్‌ సూచించారు. మెరుగైన సమాజం నిర్మాణం కోసం అందరూ పాటుపడాలన్నారు.

Spread the love