– లేచి.. పడిన మార్కెట్లు
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కానరావడం లేదు. బుధవారం ఆశాజనకంగానే ప్రారంభమైన సూచీలు.. చివరి అరగంటలో అమ్మకాల ఒత్తిడితో తుదకు నష్టాలను చవి చూశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 79,921 పాయింట్ల వద్ద ప్రారంభం కాగా.. ఇంట్రాడేలో 80,646 గరిష్టానికి చేరగా.. మరో దశలో 79,892కనిష్ఠానికి పడిపోయింది. తుదకు 138.74 పాయింట్ల నష్టంతో 80,082 వద్ద ముగిసింది. అదే బాటలో నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 24,435 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఎల్‌అండ్‌టి, అదానీ పోర్ట్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు అధిక నష్టాలను చవి చూడగా.. బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.