హైదరాబాద్ : ఐఓసీఎల్, సన్ మొబిలిటీ జాయింట్ వెంచర్ అయినా ఇండోఫాస్ట్ ఎనర్జీతో భాగస్వామ్యం కుదర్చుకున్నట్టు పముఖ క్యాబ్ సేవల అగ్రిగేటర్ రాపిడో వెల్లడించింది. ఈ ఒప్పందంలో భాగంగా 10,000 పియాజియో త్రిచక్ర విద్యుత్ ఆటోలను ప్రవేశపెట్టనున్నామని తెలిపింది. వచ్చే 24 మాసాల్లో వీటిని హైదరాబాద్, బెంగళూరు ఇతర దక్షిణ ప్రధాన నగరాల్లో వీటిని అందుబాటులోకి తేనున్నామని పేర్కొంది. 2024 డిసెంబర్ నాటికి 1,000 ఈవీలను రైడర్లకు అందించనున్నామన్నారు.