Sunday, July 13, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంబాలికపై హత్యాచారం.. దోషికి బహిరంగ మరణశిక్ష

బాలికపై హత్యాచారం.. దోషికి బహిరంగ మరణశిక్ష

- Advertisement -

టెహరాన్‌ : బాలికను హత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఇరాన్‌ అధికారులు బహిరంగంగా మరణశిక్ష విధించారు. ఈ విషయాన్ని ఇరాన్‌ స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి. సంస్థల నివేదికల ప్రకారం.. బుకాన్‌కు చెందిన ఓ బాలికను లైంగికదాడి, హత్య చేసిన కేసులో ఓ వ్యక్తి దోషిగా తేలాడు. అతడికి బహిరంగంగా మరణశిక్ష విధించాలని బాధిత కుటుంబసభ్యులు, ప్రజల నుంచి పెద్దఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. మార్చిలో అతడికి మరణశిక్ష ఖరారు కాగా.. సుప్రీంకోర్టు కూడా దాన్ని సమర్థించింది. భావోద్వేగాలతో ముడిపడిన కేసు కాబట్టి కఠినశిక్షపై నిర్ణయం తీసుకున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -