గిరిజన విద్యార్థికి లక్ష యాభై వేల చెక్కు అందజేసిన మంత్రి

నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : మిట్టపల్లి సురభి మెడికల్ కాలేజి లో మెడిసిన్ సీటు సాధించి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న హుస్నాబాద్ మండలంలోని బల్లు నాయక్ తండాకి చెందిన గిరిజన విద్యార్థి లావుడ్య దేవీ కి హాస్టల్ ఖర్చుల నిమిత్తం బుధవారం హుస్నాబాద్ క్యాంప్ కార్యాలయంలో లక్షా యాభై వేల రూపాయల చెక్కును మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బంక చందు, మాజీ పట్టణ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ పాల్గొన్నారు.
Spread the love