హైదరాబాద్ : నైపుణ్యాల పెంపునకు గాను అడ్డా247తో ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ యాక్సిస్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇది మెరుగైన నైపుణ్యం ఉన్న వారికి యాక్సిస్ బ్యాంకులో సేల్స్, రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్‌లో ఉద్యోగులను తీసుకోవడానికి అదే విధంగా తర్వాతి తరం నైపుణ్యం కలిగిన బ్యాంకర్లను నియమించుకోవడానికి ఉపయోగపడుతుందని ఆ బ్యాంక్ వర్గాలు తెలిపాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రదానమైన విక్రయాలు, సేవల విభాగంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడంతో పాటు రాణించడానికి దోహదం చేయనుందని తెలిపింది. తమ సంస్థ బ్యాంకింగ్ రంగంలో మానవ వనరులను అందించడానికి ఏర్పాటు చేయబడిందని అడ్డా 247 వ్యవస్థాపకుడు, సిఇఒ అనిల్ నగర్ పేర్కొన్నారు.