– ఎస్‌బీఐ చైర్మెన్ సీఎస్ శెట్టి అంచనా
ముంబయి : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) వచ్చే 2025 ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీఐ ఛైర్మన్ సీఎస్ శెట్టి అంచనా వేశారు. అది కూడా 25 బేసిస్ పాయింట్లు (పావు) శాతం మేర కోత పెట్టొచ్చని పేర్కొన్నారు. అప్పటి వరకు రిటైల్ రుణ గ్రహీతలు వేచి చూడాల్సిందేనని అన్నారు. డిపాజిట్లపైనా వడ్డీ రేట్లు హెచ్చు స్థాయికి చేరి ఉన్నాయన్నారు. రుణాలపై ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ ఆ ప్రభావం బ్యాంక్‌లపై తక్కువగాను ఉండొచ్చన్నారు.