మండలంలోని ఉప్పల్వా ఎస్సీ, రామారెడ్డి లోని కస్తూర్బా, ఎస్సీ హాస్టల్లో, ఉప్పల్ బాయి సాంఘిక సంక్షేమ గురుకుల, రామారెడ్డి బాలుర, బాలికల, మండల పరిషత్ పాఠశాలలోని మధ్యాహ్నం భోజనం, వంట గదులన, ఆహార నాణ్యతను మంగళవారం కామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సురేష్ పరిశీలించారు. ఆయా పాఠశాలలో అనారోగ్యానికి గురైన విద్యార్థులకు మందులను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, వైద్య సిబ్బంది భీం, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.