కాచికలు – మేచరాజుపల్లికి బస్సు నడిపించాలి ..

Bus should be run to Kachikal - Mecharajupalli..– ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి 
– తెగిపోయిన చెరువు కట్టలను తక్షణమే గండ్లను పూడ్చి నీటిని వదిలాలి
– సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంటి రాజన్న 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని కాచికల్ స్టేజి నుండి మేచరాజుపల్లి గ్రామ వరకు వెళ్లే రోడ్డు నిర్మాణం పనులు తొందరగా పూర్తి చేసి ఆ గ్రామాలకు బస్సు సౌకర్యం తక్షణమే కల్పించాలని ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు గునిగంట రాజన్న అన్నారు. మండలంలోని ఎర్రబెల్లి గూడెం కాచికల్ రామాంజపురం సొసైటీ తండాలో సర్వే నిర్వహించిన అనంతరం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాలకు కొన్ని గ్రామాలలో చెరువు కట్టలు తెగిపోయిన వాటిని ఇంతవరకు పట్టించుకోలేదని నేను రైతులనేగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కట్టను మరమ్మతు లు చేసి వెంటనే ఆ గ్రామాల చెరువులకు ఎస్సారెస్పీ కాలువ ద్వారా నీటిని చెరుకులోకి నింపే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నాడు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నెల్లికుదురు మండలంలోని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఇంటింటి సర్వేలో భాగంగా కాచికలు ఎర్రబెల్లి గూడెం రామంజపురం సొసైటీ తండా సర్వే నిర్వహించగా.. ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా కాచికల్లు స్టేజి నుంచి మేచరాజుపల్లి వరకు రోడ్డు గుంతల మయంగా ఉండటం వలన ఆర్టీసీ బస్సు రాకపోవడం వల్ల ప్రజల సౌకర్యార్థం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చెందాడు.  అకాల వర్షాలకు కాచికల్లు గ్రామం సమీపాన వ్యవసాయదారులు భూమి సుమారుగా1800వందల ఎకరాలు రైతులు నిత్యం వారికి ఉపయోగపడే తాళ్లగడ్డకు వెళ్లే దారి1380మీటర్ల దూరం గల దారి అధ్వానంగా ఉండటం వల్ల వర్షాలకు తెగిపోయిన చెరువు కట్టను ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు చెరువుకట్టకు మరమ్మతులు చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్రబెల్లి గూడెం ప్రజలు భూములు అంతంతమాత్రంగా ఉన్న వారికి పట్టాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రామాలలో ఉపాధి పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని గిరిజనులు సాగు చేసుకుంటున్నా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని రైతు భరోసాను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  ఈ  కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఇసంపల్లి సైదులు మండల నాయకులు బాబు గౌడ్ దస్తగిరి గణపురం ఎల్లయ్య వెంకన్న అశోక్ శ్రీను కుమారు సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love