- Advertisement -
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పడంపల్లి గ్రామ శివారు ప్రాంతంలో గొర్రెల కాపరికి పెద్ద అనుకొండ కనిపించడంతో అవాక్కయ్యారు. హుటాహుటిన ఇతర గొర్రె కాపరులతో కలిసి అనుకుండ ఉన్న పొలానికి వచ్చారు. అనంతరం ఫోన్లలో చిత్రీకరించారు. అప్పుడు అనకొండ బుస్సు బుస్సు మనీ వారిపైకి రావడంతో భయాందోళన వారు గురై పరుగో పరుగు తీశారు. అనంతరం జానకి వార్ లక్ష్మణ్ అనే ఒక గొర్రెల కాపరి ధైర్యం చేసి పొడువాటికట్టెతో అనకొండపై దాడి చేశాడు. దీంతో అది పారిపోయే ప్రయత్నం చేసింది. అయితే ఈసారి మిగిలిన వారుకూడా దానిపై మాకుమ్మడిగా దాడి చేయడంతో ప్రాణం వదిలింది. అనకొండ సుమారుగా నాలుగున్నర మీటర్లు ఉంటుందని గొర్రెల కాపరులు తెలిపారు.
- Advertisement -