మండలంలోని పసర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ఘనంగా తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయులు వర్ణాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిత్యం ఉపయోగించే ఆహార పదార్థాలను విద్యార్థులకు పరిచయం చేయడానికి గాను తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ని 61 రకాల ఆహార పదార్థాలను విద్యార్థులు తమ తల్లిదండ్రుల సహకారంతో తయారు చేసుకొని ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి గొంది దివాకర్ హాజరు కావడం జరిగిందన్నారు. ఫుడ్ ఫెస్టివల్ ను ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో తీసుకునే ఆహార పదార్థాలు అన్నీ సమీకృత ఆహారాన్ని సూచిస్తున్నాయని ఈ విషయం ఫుడ్ ఫెస్టివల్ ద్వారా తెలిసిందని అయితే కల్తీ కి దూరంగా సహజ సిద్ధమైన ఆహార పదార్థాలతో ఇంట్లోనే వండుకోవాలని తద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సోమారెడ్డి, తిరుపతయ్య, పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ అధ్యక్షులు సూడి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ కుమార్ ప్రధాన కార్యదర్శి బొబ్బ క్రాంతి కుమార్, పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.