గుంతలోకి దూసుకెళ్లిన కారు..

The car crashed into the pothole.– తప్పిన ప్రమాదం..
నవతెలంగాణ – తాడ్వాయి
కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లిన సంఘటన తాడ్వాయి మండలం లింగాల గ్రామపంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో గురువారం చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన వనదేవతల భక్తులు, వనదేవతల దర్శనానికి మేడారం వస్తున్న క్రమంలో లింగాల అటవీ ప్రాంతంలో మూలమలుపు వద్ద, కంకర బోసి తారుపోయకపోవడంతో, కారు అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది అని తెలిపారు. అయితే కారులో ఉన్న వాహనదారులకు ఎలాంటి ప్రమాదం లేదని జరగలేదని అన్నారు. మూలమలుపు వద్ద హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రోడ్డు బాగా లేకపోవడం వలన గతంలో పలుమార్లు ఇలాంటి ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి లింగాల, పస్రా- గుండాల రహదారికి రోడ్డు సిగ్నల్స్, ఏడు కిలోమీటర్ల కంకర రోడ్డుపై వెంటనే తారు పోయాలని ఏజెన్సీ వాసులు కోరుకుంటున్నారు. అలాగే ఇన్ని వాహనాలు అదుపుతప్పి పడిపోయిన కారణంగా రోడ్డు పోయకుండా వదిలివేసిన కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Spread the love