నూతన సంవత్సర వేడుకల (న్యూ ఇయర్ 2025) నేపథ్యంలో మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. సర్పంచులు ప్రజాప్రతితులు ప్రముఖ నాయకులకు ఆయా పార్టీల శ్రేణులు అభిమానులు పలువురు హాజరై స్వీట్లు పుష్ప గుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు. నివాసాల వద్ద పార్టీ కార్యాల వద్ద న్యూ ఇయర్ కేక్ ను కట్ చేసి కేకులు స్వీట్లు అందజేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు.