ఘనంగా స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు..

Celebrating Swami Vivekananda's 162nd birth anniversary.నవతెలంగాణ – చండూరు  
స్థానిక  మున్సిపల్ కేంద్రంలో ఆధ్యాత్మిక వేత్త స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు బిజెపి పార్టీ  ఆధ్వర్యంలో  ఆ పార్టీ మండల అధ్యక్షులు, మున్సిపల్ పట్టణ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు, పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చౌరస్తాలో వివేకానందుని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను హైందవ సంఘటిత శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్రసంకల్పం కలిగిన వంద మంది యువకులు నాతో ఉంటే దేశ స్వరూపాన్నే మారుస్తానన్న స్వామీజీ మాటలు దేశ యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. “బలమే జీవనం బలహీనతే మరణం” అని వివేకానందుడు చెప్పిన ధీరవాక్కులు పోరాటస్ఫూర్తిని రగిలిస్తాయన్నారు. లేవండి మేల్కొనండి గమ్యం చేరే వరకు విశ్రమించకండి అని గర్జించిన స్వామి వివేకానందుని జీవితం ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని భారతమాత సేవలో తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అన్నేపర్తి యాదగిరి, యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, యువమోర్చా జిల్లా నాయకులు సోమ శంకర్, జిల్లా నాయకులు తడకమల్ల శ్రీధర్, ఇరిగి ఆంజనేయులు, సామ వెంకట్ రెడ్డి, బిజిలి యాదయ్య, మండల ఉపాధ్యక్షులు జెట్టి యాదయ్య, నలపరాజు యాదగిరి, సీనియర్ నాయకులు చెనగాని శేఖర్, పళ్లెగొని చంద్రమౌళి, కారింగు విజయ్, యువ మోర్చా మాజీ మండల అధ్యక్షులు ఆస్కాని శ్రీను, యువ మోర్చా నాయకులు వేముల పవన్, బూత్ అధ్యక్షులు తోకల రవీందర్, చిట్టిప్రోలు వెంకటేశం, చెరిపల్లి కృష్ణ, పున్న అరుణోదయ, పల్లపు స్వామి,మండల నాయకులు పులిజాల రవీందర్, బోయపల్లి వీరేశం తదితరులు పాల్గొన్నారు.
Spread the love