బాధిత కుటుంబానికి అండగా ఎస్ఆర్ఆర్..

SRR stands by the victim's family.– పది వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసిన పరుపాటి
నవతెలంగాణ – రాయపర్తి
మండల కేంద్రానికి చెందిన జలగం లావణ్య రవి దంపతుల కుమారుడు అన్వేష్ అనారోగ్యం కారణంగా హన్మకొండలోని ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాధిత కుటుంబ ఆర్థిక పరిస్థితి నామమాత్రంగానే ఉండడంతో సహాయం కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రాయపర్తి మండలంలో సబ్బండ వర్గాలకు అండగా నిలిచే ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి గురువారం పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనారోగ్య పాలైన అన్వేష్ ఆరోగ్యం అతి త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థించినట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు ఆర్థిక సహాయం చేసిన శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love