జాతీయ నూలి పురుగుల నివారణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ తెలిపారు. ఈ మేరకు సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమం యొక్క జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంను కలెక్టర్ & జిల్లామెజిస్ట్రేట్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సమన్వయ సమావేశంలో పాల్గొన్న జిల్లా అధికారులందరూ ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారినీ , జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వివిధ సంక్షేమ శాఖల జిల్లా స్థాయి అధికారులు అందరూ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారితో సమన్వయంగా ఉంటూ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.ఈ జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంను ఫిబ్రవరి 10 వ తేదీన జిల్లా వ్యాప్తంగా 1 -19 సంవత్సరాల పిల్లలందరికీ నులిపురుగుల నిర్మూలన కొరకు అల్బెన్దజోల్ మాత్రలు వేయడం జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో, సోషల్ వెల్ఫేర్, బి.సి వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్, కేజీబీవీ, మోడల్ పాఠశాలలు, కళాశాలల్లో హాస్టల్స్ లో మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలల్లో ఈ అల్బెన్దజోల్ మాత్రలు అందించబడుతుంది అని తెలియ జేశారు. విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని తెలియజేసీ, పాఠశాల ప్రార్థన సమయంలో, ఎస్ఎంసి సమావేశాల్లో, అంగన్వాడి మదర్స్ కమిటీ సమావేశాల్లో, న్యూట్రిషన్ డే కార్యక్రమంలో విస్తృతంగా అవగాహన కలిగించాలని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేటు విద్యా సంస్థలు మరియు కళాశాలల్లో కూడా ఈ అల్బెన్దజోల్ మాత్రలు తప్పనిసరిగా వేయాలని, ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అని తెలియజేసారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ బి రాజేశ్రీ మాట్లాడుతూ.. అల్బెన్దజోల్ మాత్రలు పట్ల ఎలాంటి అపోహలు అవసరం లేదని, ఈ మాత్రలు తీసుకోవడం వల్ల పిల్లల ఆరోగ్యానికి మంచిదని, ఈ మాత్ర వల్ల నులిపురుగులను, రక్తహీనతను నిర్మూలించి ,పోషకాహార గ్రాహ్యతను, ఏకాగ్రతను, హాజరు శాతాన్ని పెంచుతుందని , అన్ని పాఠశాలల్లో చేతుల శుభ్రతపై వీధుల్లో దొరికే చిరుతిళ్లను తినకుండా నిషేధించాలని, భోజనం చేసిన తర్వాతనే ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి నమిలి తీసుకో నే విధంగా ,ప్రార్థన సమయంలో అవగాహన కలిగించాలని,ఎవరైనా పిల్లలు అనారోగ్యం కారణంగా కానీ మరి ఏ ఇతర కారణాల వల్ల ఐన అల్బెన్దజోల్ మాత్రలు ఫిబ్రవరి 10 వ తారీఖున వేసుకోనట్టయితే మాప్ అప్ డే నాడు అనగా ఫిబ్రవరి 17 వ తారీఖున తప్పనిసరిగా వేసుకోవాలని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు తమ వంతు బాధ్యతగా 100% విద్యార్థులు ఆల్బెండజోళ్ళు మాత్రలు తీసుకునేలా బాధ్యత తీసుకోవాలని, అంగన్వాడి టీచర్లు వారి వద్ద ఉన్న రిజిస్టర్డ్, అన్ రిజిస్టర్డ్ పాఠశాల ,కళాశాలకు వెళ్లని విద్యార్థుల జాబితా ఆధారంగా ఆల్బెండజోల్ మాత్రను అందించాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్లు స్థానిక సంస్థలు అంకిత్, రెవిన్యూ కిరణ్ కుమార్, డి ఆర్ డి ఓ సాయ గౌడ్ , ఆర్డీవో రాజేంద్రకుమార్ , మెప్మా పీడీ రాజేందర్ జిల్లా ఇమ్మునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ రమేష్ , డాక్టర్ రాజు , డీఎస్ఓ డాక్టర్ నాగరాజు, పిఓ డాక్టర్ వినీత్ , జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి బి నాగోరావు, విద్యాశాఖ నుండి విజయభాస్కర్,ఆర్.బి. స్.కె మేనేజర్ సచిన్, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్ వెంకటేశం, ఆర్.బి. స్.కె సిబ్బంది, పాల్గొన్నారు.