టిపిటిఎఫ్ అభ్యర్థి వై అశోక్ కుమారుని గెలిపిస్తే..

– టీచర్ల గొంతుకగా పని చేస్తా టి పి టి ఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్ కుమార్
– డబ్బుసంచులతో వస్తున్న వారిని నిలువరిద్దాం 
– ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా
నవతెలంగాణ కంఠేశ్వర్ 
టీచర్ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుండి రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశానని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా గెలిపిస్తే టీచర్ల గొంతుకగా పనిచేస్తా అని అన్నారు. జిల్లా కేంద్రంలో వై అశోక్ కుమార్ కు మద్దతిస్తున్న భాగస్వామ్య సంఘాల నాయకులు హైదరాబాద్ రోడ్లో గల వంశీ ఇంటర్నేషనల్ హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం డబ్బుసంచులతో వస్తున్నారని,వారిని నిలువరిద్దామన్నారు.
ప్రభుత్వ విద్య బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. చేసి ఉన్న తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా పనిచేశారు. తెలంగాణ  జేఏసీతో కలిసి అనేక పోరాటాలు చేసి తెలంగాణ రావడానికి నా వంతు ఉద్యమం పాత్రను పోషించడం జరిగింది.అలాగే విద్య అందరికీ సమానమైన విద్య అందాలనే తాపత్రయంతో విద్యా పరిరక్షణ సమితి ప్రొఫెసర్ హారగోపాల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి దాంట్లో కూడా నేను భాగస్వామి అయినాను. సామాజిక సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి విద్యావంతుల వేదికలో కూడా రాష్ట్రస్థాయిలో నేను పనిచేసిన నేపథ్యం అంతా కూడా విద్యారంగ ప్రయోజనాలు ఉపాధ్యాయుల అధ్యాపకుల యొక్క సంక్షేమము,అలాగే సామాజిక సంక్షేమం అనేటువంటి నేపథ్యంలోనే పనిచేశారు.
 నా జీవితమంతా కూడా మొత్తం విద్యారంగం చుస్తే పెన వేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. నన్ను గనుక ఎమ్మెల్సీగా ఎంపిక చేసినట్లయితే అదే ఓర వ డితోనే సభల్లో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల అధ్యాపకుల గొంతుకని అవుతానని అందరికీ హామీ ఇస్తున్న,అదే సందర్భంలో గతంలో మనం ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్సీలు విద్యారంగ ఏజెంట్లను ఎమ్మెల్సీగా చట్టసభలలో వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చినటువంటి నూతన విద్యా విధానంలో ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. విద్య మొత్తం కేంద్ర ప్రభుత్వము అది కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వాళ్ల గుత్తాధిపత్యం లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది. దానివల్ల పేద ప్రజలకు మరింత నష్టం జరిగి ఈ ప్రాంతంలో ఉండేటువంటి భాషలో గాని ఈ ప్రాంతంలో ఉండేటువంటి సిలబస్ గాని అందులో రాకుండా పోతున్న పరిస్థితిని కనుక విద్య ఉమ్మడి జాబితాలో ఉండాలంటే దాన్ని అమలు చేయకుండా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.
ఈ పాత్రను నేను శాసనమండలిలో ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి అది ఆమాలు కాకుండా చూసేటువంటి బాధ్యతలు తీసుకున్న, ఏమైనా ఉంటే వాటికి ఎదిగేలు మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్ సపోర్ట్ చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ప్రవేట్ యూనివర్సిటీలో బిల్లు చేస్తున్నాయి.
దీనివల్ల పేద ప్రజలకు ఉన్నత విద్య నుంచి అందకుండా ఉంది .కనీసం గా ఈ ప్రభుత్వం 15% నిధులు కేటాయిస్తా అని చెప్పింది కానీ ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన దాంట్లో 7.4% మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం వాగ్దానం చేసినటువంటి 15% నిధులు కేటాయించడానికి నిలబడతానని చెప్పి హామీఇస్తున్నాను.పేదలకు ప్రభుత్వ విద్య దూరమవుతున్న పట్టించుకునే వారు కరువయ్యారని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్ కుమార్ ఆరోపించారు.ధన రాజకీయాలను ఓడించి ఉద్యమ నాయకులను ఎమ్మెల్సీ లు గా ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని అన్నారు. గత 36 సంవత్సరాలుగా వై అశోక్ కుమార్ పూర్తిగా ఉపాద్యాయ ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిగా మీ ముందుకు వస్తున్నారు. ఉపాద్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ పటిష్టతకు కృషి చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేస్తాడు తెలిపారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఏజెంట్ కె.వేణుగోపాల్ మాట్లాడుతూ కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ గెలిచిన తర్వాత కూడా ఉపాధ్యాయుల పక్షాన్ని పోరాడుతాడు మిగతా వారిలాగా రాజకీయ పార్టీలు కండువాలు కప్పుకొను నేను హామీ ఇస్తున్నాను అని తెలియజేశాడు. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లుల విషయంలో, టెట్ పరీక్ష విషయంలో ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. తీపి జేఏసీ చైర్మన్ డా. సూరి, జేఏసీ కన్వీనర్ భాస్కర్ , టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ళ సురేష్,ప్రధాన కార్యదర్శి పూదారి అరవింద్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడ రమేష్ ప్రధాన కార్యదర్శి గంగాధర్ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోషన్న టిపిటిఎఫ్ నాయకులు సత్యనారాయణ, గోపి,నగేష్ అలీం, చంద్రశేఖర్ రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
Spread the love