– పట్టించుకోని ప్రభుత్వం..నిర్లక్యంగా అధికారులు
నవతెలంగాణ – బెజ్జంకి
ఊరంత ఊడ్చుతూ..మురుగుకాల్వలు శుభ్రపరుస్తూ గ్రామాల పరిశుభ్రతకు పాటు పడుతున్న పంచాయితీ కార్మికులు కనీస వేతనాలందక పనులు చేస్తూనే.. పస్తులుండాల్సిన గడ్డు దుస్థితిని పంచాయతీ కార్మికులు, సిబ్బంది ఎదుర్కొంటున్నారు. గత మూడు నెలలుగా ప్రభుత్వం కనీస వేతనాలందించకపోవడంతో కుటుంబాలను నెట్టుకురావడం ఇబ్బందిగా మారిందని పంచాయతీ పారిశుధ్య కార్మికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకాధికారులు పంచాయతీల్లో సమయానుకూలంగా పనులు చేయించుకుంటున్నారని, వేతనాలందించడంలో పట్టించుకోవడంలేదని, సంబంధిత ప్రభుత్వాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పంచాయతీ కార్మికులు ఆదివారం అవేదన వ్యక్తం చేశారు. నేలలుగా వేతనాల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపి వేతనాలందించాలని పంచాయితీ కార్మికులు, సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు.