నవతెలంగాణ – అచ్చంపేట
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా గిరిజన ఆదివాసీ విద్యార్థుల విద్య కోసం 2017 సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 22 గిరిజన డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లా కు ప్రభుత్వం ఒక గిరిజన పురుషుల డిగ్రీ కళాశాల ను కేటాయించారు. ఎక్కువ సంఖ్యలో గిరిజన సామాజిక వర్గానికి చెందిన లంబాడీ, చెంచు, ఎరుకల విద్యార్థులు అచ్చంపేటలో అధికంగా ఉండడంతో అచ్చంపేట లో 2017 ఆగస్టులో ప్రారంభించారు. కానీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు 2019 సంవత్సరంలో జడ్చర్ల కు తరలించారని గిరిజన సేవా సంఘం నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే డా వంశీకృష్ణ గారు మాట్లాడుతూ నల్లమల్ల ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గం లో గిరిజనుల విద్యా అభివృద్ధి చేయడమే లక్ష్యం గా పనిచేస్తా అదే విధంగా గిరిజన డిగ్రీ పురుషుల కళాశాలలో అచ్చంపేటకు తీసుకొస్తానని, అదేవిధంగా మన్ననూర్ నుంచి మొయినాబాద్ లో తరలించిన సి ఓ ఈ కళాశాల ను అచ్చంపేట నియోజన వర్గానికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు ఈ కార్యక్రమం లో ఛత్రునాయక్ ,శ్రీనివాస్ నాయక్, నరసింహ నాయక్,వినోద్ నాయక్,జాను, శక్రు, బలరాం, దశరథం, భరత్ ,రమేష్, శివ, రాహూల్ తదితరులు పాల్గొన్నారు.