చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి..

Avoid bad habits.–  సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: బోధన్ ఎసిపి శ్రీనివాస్..
నవతెలంగాణ – రెంజల్
ప్రభుత్వం విద్య వ్యవస్థ పై ప్రత్యేక దృష్టి సారిస్తూ, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్న ఈ సమయంలో విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదువుతూ మంచి ర్యాంకులు సాధించాలని బోధన్ ఏసిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం మండలంలోని నీలా జిల్లా పరిషత్ పాఠశాల లో పదవ తరగతి విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా బోధన అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 25 సంవత్సరాల లోపు కష్టపడి చదివిన వారందరికీ మిగతా 75 సంవత్సరాలు ఆనందంగా గడిపే అవకాశం దొరుకుతుందన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి ని సారీస్ తమ పిల్లలను చెడు వ్యసనాలకు దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమాజంలో ప్రభుత్వ పాఠశాలలలోని చదివిన అనేకమంది నేడు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు పరీక్షల్లో మంచి మార్కులను సాధించి పాఠశాలకు, తమ గ్రామానికి ఆదర్శంగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు పలువురని ఆకర్షించాయి. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కట్ట ఆంజనేయులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈ శంకర్, రెంజల్ ఎస్ఐ ఈ సాయన్న, పి ఆర్ టి ఓ మండల అధ్యక్షులు టి సోమలింగం గౌడ్, ఉపాధ్యాయులు శ్రీరామ్, శ్రీనివాస్ రెడ్డి, వ్యాయమ ఉపాధ్యాయులు సాయిబాబా, గులాం హైమద్, తాహెర్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love