
నవతెలంగాణ – గోవిందరావుపేట
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బూత్ నెంబర్ 70 ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రొసీడింగ్ ఆఫీసర్ నవీన్ కుమార్ తెలిపారు. బుధవారం స్థానిక పోలింగ్ కేంద్రం బయట మీడియా ప్రశ్నకు సమాధానం ఇస్తూ పోలింగ్ కేంద్రంలో 108 మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 67 మంది పురుష ఓటర్లు కాగా 41 మంది మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోబోతున్నారని అన్నారు. ఓటింగ్కు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహణ ఉంటుందని అన్నారు. పి వో1, ఏపీవో 1 ,ఓ పి ఓ 2, మైక్రో అబ్జర్వర్ 1 మొత్తం ఐదుగురు ఎన్నికల సిబ్బంది ఐదుగురు పోలీసు సిబ్బంది పోలింగ్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక తహసిల్దార్ సృజన్ కుమార్ సెక్టార్ ఆఫీసర్ గా వ్యవహరించనున్నారు. పోలింగ్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.