నవతెలంగాణ – భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ హనుమంత రావు తెలిపారు. పోలింగ్ 27న (గురువారం) ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరగనున్న నేపథ్యం లో బుధవారం 26 న రాయిగిరి లో విద్యా జ్యోతి హై స్కూల్ లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి..పోలింగ్ సిబ్బంది ( పి ఓ లు ఏపీవోలు ఓపివోలు మైక్రో అబ్జర్వర్లు) ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రిని తీసుకొని , వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు సురక్షితంగా తరలివెళ్లారు.ఈ ప్రక్రియని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి స్వయం గా పరిశీలించారు.
పోలింగ్ ప్రక్రియపై కలెక్టర్ సూచనలు:
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు .జిల్లా లో మండలానికి ఒక్కటి చొప్పున 17 పోలింగ్ కేంద్రాలు పూర్తిగా సిద్ధంగా ఉన్నాయన్నారు.పోలింగ్ సిబ్బంది ఎన్నికల నిబంధనలను పూర్తిగా అవగాహన చేసుకుని విధులను నిర్వర్తించాలన్నారు. ఓటింగ్ గోప్యతను ఖచ్చితంగా పాటించాలని” అన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోని ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన, తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, షామియానాలు వంటి అన్ని వసతులు సమర్థంగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలు:
మొత్తం ఓటర్లు: 984
17 మంది పిఒల్లు 17 మంది ఏపీవోలు 17 మంది ప్రతి పోలీస్ స్టేషన్కు ఓపి వీలు 34 మంది మైక్రో అబ్జర్వ్ 15 మంది ఉంటారని తెలిపారు.
రూట్ ప్లాన్: ప్రతి మూడు పోలింగ్ కేంద్రాలకు ఒక్క సెక్టార్ ఆఫీసర్ల చొప్పున 6 సెక్టార్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సమగ్ర మౌలిక సదుపాయాల ఏర్పాటు: తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు, సీసీ కెమెరాలు & వెబ్ కాస్టింగ్: అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.
రూట్ ప్లాన్: ప్రతి మూడు పోలింగ్ కేంద్రాలకు ఒక్క సెక్టార్ ఆఫీసర్ల చొప్పున 6 సెక్టార్ ఆఫీసర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
సమగ్ర మౌలిక సదుపాయాల ఏర్పాటు: తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు, సీసీ కెమెరాలు & వెబ్ కాస్టింగ్: అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేశామన్నారు.
పోలింగ్ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు:
పోలింగ్ సామగ్రి సరైన విధంగా అందిందా అనే విషయాన్ని చెక్‌లిస్ట్ ఆధారంగా ధృవీకరించాలి. బ్యాలెట్ పద్ధతి ప్రకారం పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ఓటింగ్ కేంద్రాలకు బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బంది తరలింపునకు ప్రత్యేక బస్సుల ఏర్పాటు. పోలింగ్ సామగ్రి తరలింపు సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా సంబంధిత అధికారులను వెంటనే సమాచారం అందించాలి. జిల్లాలో మొత్తం 17 పోలింగ్ కేంద్రాల్లో గురువారం ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ ఆర్డీవోలు కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి అధికారులు, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.