
మండల వ్యాప్తంగా మహాశివరాత్రి మహోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. చల్వాయి గ్రామం మరియు గోవిందరావు పేట మండల కేంద్రాల్లో శివాలయాల్లో ఉదయం 5 గంటల నుండి భక్తులు శివనామస్మరణతో పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పసర గ్రామంలోని రామాలయంలో శివరాత్రి దీపోత్సవ కార్యక్రమాలను ప్రధాన పూజారి డింగిరి రంగాచార్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పండగ సందర్భంగా రాజకీయ నాయకులు మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మిత్రులు భక్తులు ఉపవాస దీక్షలు జాగారాలు నిర్వహించారు.