మండలంలోని మాదాపూర్ ప్రైమరీ పాఠశాలలో పట్టభద్రుల బూత్ 130, టీచర్ల బూత్ 79 ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు గురువారం పరిశీలించారు. ఆయన వచ్చే సమయానికి మహిళా ఓటర్లు బరులు తిరి ఎండలో సైతం ఉన్నారు. సంబంధిత అధికారులతో ఆయన మాట్లాడి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ నిర్వహించారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కు వినియోగించుకోవటానికి వస్తున్న పట్టభద్రులకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పోలింగ్ స్లిప్ అందజేశారు. మండలంలోని మొత్తం పట్టభద్రుల ఓటర్లు 789 కి గాను , 629 పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 382, మహిళలు 247 ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ కి 79 కి గాను 76 పోలయ్యాయి. పురుషులు 50, మహిళలు 26 ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారు.