జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

Polling for the MLC election ended peacefully in the district– ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
నవతెలంగాణ-  సిరిసిల్ల
ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా జిల్లాలోని ఆయా పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం పరిశీలించారు. ఈ సందర్బంగా సిరిసిల్ల పట్టణం కుసుమ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 374,375,376 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 371,372,373 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 187 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం, కోనరావుపేట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 363,364 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని, 183 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం, వీర్నపల్లి మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 385 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాన్ని, 192 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం, గంభీరావుపేట మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 379,380 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 189 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 386,387 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 193 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రం, ముస్తాబాద్ మండల కేంద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 381,382 పట్టభద్రుల పోలింగ్ కేంద్రాలను, 190 ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాలను సందర్శించి, పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రము 4.00 గంటల వరకు 61.68 శాతం నమోదు అయింది. అలాగే టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్ సాయంత్రము 4.00 గంటల వరకు 94.11 శాతం నమోదు అయింది.

Spread the love