మండలంలోని మద్దికుంట లో వెలిసిన శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం ప్రారంభమైన ఉత్సవాలు గురువారంతో ప్రశాంతంగా ముగిస్తాయి. బుధవారం రాత్రి ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, నాటక ప్రదర్శన నిర్వహించారు. గురువారం ఉదయం అగ్నిగుండాలు నిర్వహించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి నరేందర్, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారులు ప్రభాకర్ స్వామి, గణేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.