నవతెలంగాణ-హైదరాబాద్: ఏ దేశాధినేత యుద్ధం ఆపాలని భారత్‌కు చెప్పలేదని,. అలా చెప్పినా తాము వినే వ్యక్తులం కాదని పీఎం మోడీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)పై విపక్షాల అనుమానాలకు లోక్‌సభలో ప్రధాని మోడీ సమాధానం ఇచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో పాకిస్తాన్‌కు గుణపాఠం చెప్పామన్నారు. ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా నిలిచాయన్నారు. కేవలం మూడంటే.. మూడే దేశాలు పాక్‌కు మద్దతిచ్చాయి. కానీ.. కాంగ్రెస్ నేతలు.. వారి స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని, వారి వీరోచిత పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడారు.
‘దేశానికి ఏం కావాలో ఆ సమయంలో అది చేసి తీరుతాం. దాడులు ఆపాలని పాకిస్తాన్ గగ్గోలు పెట్టింది. ఇది ప్రపంచ దేశానికి తెలుసు. ఎవరూ ఊహించని రీతిలో పాకిస్తాన్‌ను చీల్చిచెండాడాం. ప్రపంచ దేశాలు మనకు మద్దతుగా నిలిచాయి. కేవలం మూడంటే.. మూడే దేశాలు పాక్‌కు మద్దతిచ్చాయి. కానీ.. కాంగ్రెస్ నేతలు.. వారి స్వార్థ రాజకీయాల కోసం సైన్యాన్ని, వారి వీరోచిత పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు పాకిస్తాన్‌కు అధికార ప్రతినిధులుగా పనిచేశారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ఆగలేదు. పాకిస్తాన్ మళ్లీ దుస్సాహాసం చేస్తే.. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. స్వావలంబనతో భారత్ నేడు ముందుకు పోతోంది. కానీ.. పాక్ కోసం కాంగ్రెస్ దిగజారి రాజకీయం చేస్తోంది’ అని ప్రధాని మోడీ లోక్‌సభలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.