నవ్వుల్‌ పువ్వుల్‌

ఎంత తీరిక!
భర్త : హారు డార్లింగ్‌… ఈ రోజు ఇల్లంతా ఇంత నీట్‌గా సర్దేశావు… నీ ఫోన్లో వాట్సప్‌ పని చేయలేదా?
భార్య : వాట్సప్‌ సంగతి దేవుడెరుగు. అసలు సెల్లే కనిపించకపోవడంతో దానికోసం వెతుకుతూ ఇల్లంతా సర్దేశాను.

అదంతే…
భార్య : అదేంటి గత సంవత్సరం మనం ప్రేమలో ఉన్నప్పుడు ఎర్ర గులాబి ఇచ్చారు. ఇప్పుడు తెల్ల గులాబి ఇచ్చారెందుకు?
భర్త : అప్పుడు ప్రేమ కావాలి కాబట్టి ఎర్ర గులాబి.. ఇప్పుడు శాంతి కావాలి కాబట్టి తెల్ల గులాబి ఇస్తున్నాను.
నిద్ర
భర్త : ఈ రోజు వంట చేయలేదేం..?
భార్య : పడ్డానండీ.. పట్టేసింది..
భర్త : ఎక్కడ పడ్డావు.. ఏం పట్టేసింది..?
భార్య : దిండుపై పడగానే నిద్ర పట్టేసింది.
కుడి ఎడమైతే…
టీచర్‌ : రవీ… 212లో నుంచి 2 తీస్తే ఎంత?
రవి : కుడివైపు తీస్తే 21, ఎడవైపు తీస్తే 12, రెండువైపులా తీస్తే 1.
టైం సరిపోవద్దూ!
టీచర్‌ : పరీక్షలొస్తున్నాయి కదా స్కూలుకు ఎందుకు రావట్లేదు?
విద్యార్థి : కాపీ కొట్టడానికి స్లిప్పులు రెడీ చేసుకోవడానికి టైమ్‌ కావాలిగా అందుకని..!
దొంగతనం
రాజేష్‌ : పొద్దున నుంచి నదిలో ఈత కొడుతున్నారు. ఏదైనా గిన్నిస్‌ బుక్‌లోకి ఎక్కేందుకు ట్రై చేస్తున్నారా?
సురేష్‌ : అదేం కాదండి బాబూ.. నేను ఈతకెళ్లగానే నా బట్టలెవరో ఎత్తుకుపోయారు..!
పది తక్కువ
కొడుకు : ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌ ఇచ్చారు నాన్నా…
తండ్రి : ఎన్ని మార్కులొచ్చాయి?
కొడుకు : రాము కంటే పది మార్కులు తక్కువ
తండ్రి : రాముకి ఎన్ని మార్కులు వచ్చాయి?
కొడుకు : పది మార్కులు.
ఒకే కోరిక
సోమేష్‌ : నేను మా నాన్నలాగే డాక్టర్‌ కావాలని కోరుకుంటున్నాను.
గోపి : ఏంటి, మీ నాన్న డాక్టరా?
సోమేష్‌ : కాదు. మా నాన్న కూడా నాలాగే కోరుకున్నారట.

Spread the love