నిధులు మంజూరుపై… మంత్రి శ్రీధర్ బాబుకు కృతజ్ఞతలు

 Ippa Moodaiah– తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు:
మండల అభివృద్ధికి నిధులు మంజూరుపై తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము చైర్మన్ ఆదివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మండలంలోని ఎంఎంఆర్ గ్రాంట్ కింద కొయ్యూరు నుండి కుంభంపల్లి బిటి రెన్యువల్ కు రూ.141 లక్షలు, చిన్న తుండ్ల నుండి పెద్దతుండ్ల బీటీ రెన్యువల్ కు రూ.102 లక్షలు, నాచారం నుండి తాడువాయి వరకు రెన్యువల్ కు రూ.65 లక్షలు మరియు సి ఆర్ ఆర్ గ్రాంట్ ఎస్సీ కాంపౌండ్ వివిధ గ్రామాల్లో రూ.72 లక్షల రూపాయలు సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.పేదల సంక్షేమం, పల్లెల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు.

Spread the love