- YouGov – Amazon Alexa అధ్యయనం
నవతెలంగాణ హైదరాబాద్: ప్రపంచ నిద్ర దినోత్సవానికి ముందస్తుగా, 10 నగరాల్లోని భారతీయ నివాసాల్లో నిద్రకు సంబంధించిన దినచర్య అలవాట్లను అర్థం చేసుకునేందుకు YouGov మరియు Amazon Alexa నిర్వహించిన ఒక సమీక్షకు సంబంధించిన అంశాలను విడుదల చేశాయి. స్థిరమైన నిద్ర వేళల్ని దినచర్యలో భాగంగా అనుసరించనప్పుడు తాము నిద్ర సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నామని సమీక్షకు స్పందించిన వారిలో 53% మంది తెలియజేశారని సర్వే సూచిస్తోంది. పెద్దలు నిద్ర వేళకు సంబంధించిన దినచర్యలను చురుకుగా అనుసరిస్తారని అధ్యయనం మరింత అంచనా వేస్తుంది – సమీక్షకు స్పందించిన వారిలో 54% మంది సాధారణ నిద్ర దినచర్యను అనుసరించినప్పుడు నిద్రలో గణనీయమైన మెరుగుదలను చూశారు.
సమీక్షకు స్పందించిన వారిలో 52% మంది స్థిరమైన నిద్రవేళను, నిద్రకు ముందు కొన్ని అలవాట్లను అనుసరిస్తున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో 86% మంది నిత్యం రాత్రి 8 గంటల నుంచి తమ నిద్రవేళ దినచర్యను ప్రారంభిస్తుండగా, వీరిలో 53% మంది రాత్రి 10.30 అనంతరం నిద్రకు ఉపక్రమించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సమీక్షకు స్పందించిన వారిలో తమ దిన చర్యలలో కీలక భాగంగా వీడియో కంటెంట్ చూడటం (63%), కుటుంబం, స్నేహితులతో కలిసి కాలం వెళ్లదీయడం (59%), పాడ్‌కాస్ట్‌లు, సంగీతం లేదా ఆడియో బుక్‌లను ఆలకించడం (58%) మరియు సోషల్ మీడియా యాప్‌ల స్క్రోలింగ్ (57%) ఉన్నాయి. జంటలు మాత్రమే ఉన్న కుటుంబాలు తమ నిద్రవేళ దినచర్యలో భాగంగా ఈ కార్యకలాపాలను అనుసరిస్తుండగా, అన్ని ఇతర గృహ రకాలలో ఇదే తరహా విధానాన్ని ఎక్కువగా అనుసరిస్తున్నారు.
సమీక్షకు స్పందించిన ప్రతి ఇద్దరిలో ఒకరు తమ నిద్ర దినచర్యలను నిర్ణయించుకునేందుకు వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగిస్తారు- 25-34 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారితో పోలిస్తే 35-45 ఏళ్ల మధ్య వయస్సు గల వ్యక్తులు వాయిస్ అసిస్టెంట్‌లను వినియోగిస్తున్నారు.
‘‘నిద్ర దినచర్యలు ప్రజాదరణ పొందుతున్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే స్మార్ట్ టెక్నాలజీలు, ముఖ్యంగా Alexa వంటి వాయిస్ అసిస్టెంట్లు, ప్రజలు తమ నిద్రవేళ దినచర్యలను అనుసరించడంలో సహాయపడటంలో విలువైన సహాయంగా మారుతున్నాయి. నిద్రవేళకు ముందు హ్యాండ్‌హెల్డ్ స్క్రీన్ పరికరాలకు ఆచరణాత్మక ప్రత్యామ్నాయాలుగా వ్యక్తిగతీకరించిన వాయిస్ AI ఎక్స్‌పీరియన్స్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. ధ్యానానికి సంబంధించిన సెషన్‌ను ప్లే చేయడం లేదా విశ్రాంతిని అందించే శబ్దాలు ఆలకించడం, ఆడియోబుక్‌లు లేదా సంగీతాన్ని వినడం, రిమైండర్‌లు, అలారాలను సెట్ చేయడం లేదా గది నిద్ర వాతావరణాన్ని సర్దుబాటు చేయడానికి స్మార్ట్ పరికరాలను నియంత్రించడం వంటివి అయినా, ప్రజలు తమ నిద్రవేళ దినచర్యలలో భాగంగా Alexaను వినియోగించేందుకు వినూత్న మార్గాలను కనుగొంటున్నారు. అదే విధంగా, Alexa వినియోగదారులు Alexa యాప్ ద్వారా తమ నిద్రవేళ దినచర్యను సులభంగా సెటప్ చేసుకోవచ్చు. దానిని వారి నిర్దిష్ట అవసరాలు, ప్రాధాన్యతలకు అనుకూలీకరించవచ్చు’’ అని Alexa India కంట్రీ మేనేజర్ టీనా సిదానా వివరించారు. జంటలు మరియు పిల్లలు ఉన్న కుటుంబాలు గృహ రకాల కంటే నిద్ర దినచర్యలను సెటప్ చేయడానికి వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగిస్తారు.
జంటలు, పిల్లలు ఉన్న కుటుంబాలు రొటీన్‌లను అనుసరించేందుకు వాయిస్ అసిస్టెంట్ల సహాయం తీసుకోవడంలో ఉన్నత స్థానంలో ఉండగా, అనంతరం ఇతర గృహ రకాలు* ఉన్నాయి. సమీక్షకు స్పందించిన ప్రతి ఒక్కరూ సంగీతం, పాడ్‌కాస్ట్‌లు, ధ్యాన ప్లే లిస్ట్, పరిసర శబ్దాలు, సినిమాలు, ఆడియో బుక్‌లను వినేందుకు స్మార్ట్ పరికరాల్లో వాయిస్ అసిస్టెంట్ల సహాయం తీసుకుంటారు. దాదాపు 23% మంది రిమైండర్‌లు, అలారాలను సెటప్ చేయడానికి వాయిస్ అసిస్టెంట్‌లను ఉపయోగిస్తారు మరియు 22% మంది బెడ్‌రూమ్ లేదా బేబీ రూమ్‌లో స్మార్ట్ లైట్లు, ఆటోమేటెడ్ కర్టెన్లు, స్మార్ట్ ఏసీలు మొదలైన స్మార్ట్ గృహోపకరణాలను నియంత్రించడానికి దీనిని ఉపయోగిస్తారు. ధ్యాన ప్లే లిస్టులను ఆలకించడం, నిద్రకు ముందస్తుగా పుస్తక పఠనం పెద్దలలో ఆసక్తి పెరుగుతుంది.
సమీక్షకు స్పందించిన వారిలో ధ్యానం, పుస్తక పఠనం సహాయంతో విశ్రాంతి తీసుకోవడం ప్రస్తుతం నిద్రవేళకు ముందు నిమగ్నమయ్యే కార్యకలాపాలలో తక్కువ స్థానంలో ఉంది (27%), సర్వే ప్రకారం సమీక్షకు స్పందించిన వారిలో 50% కన్నా ఎక్కువ మంది భవిష్యత్తులో వెల్‌నెస్ కార్యకలాపాలను వారి నిద్రవేళ దినచర్యలో భాగంగా చేర్చుకుంటామని ఆసక్తిని వ్యక్తం చేశారు. వీటిలో ధ్యానం, జర్నలింగ్, నడకలు వంటి తేలికపాటి వ్యాయామాలు, చర్మ సంరక్షణ దినచర్యను అనుసరించడం వంటివి ఉన్నాయి. పిల్లలు ఉన్న మరియు లేని జంటలు తమ దినచర్యలో భాగంగా ధ్యానం, జర్నలింగ్‌ను జోడించడంలో ఎక్కువ ఆసక్తిని (32%) చూపించారు. ఆసక్తికరంగా, ప్రస్తుతం దాదాపు 21% మంది నిద్రవేళకు ముందు తినడం, అల్పాహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఈ అలవాటు సమీక్షకు స్పందించిన వారిలో ఆసక్తిని పెంచుతోంది. అదే విధంగా, 34% మంది నిద్రవేళకు ముందు విశ్రాంతి పానీయం లేదా చిరుతిండిని కోరుకుంటున్నారు.
సమీక్షకు స్పందించిన వారిలో తమ దినచర్యలో చేర్చాలనుకునే ఇతర కార్యకలాపాలలో బ్రెయిన్ గేమ్ ఆటలు ఆడటం ద్వారా ఫోన్‌లను నివారించడం, పజిల్స్ పరిష్కరించడం, చదవడం, సంగీతం ఆలకించడం, పాడ్‌కాస్ట్‌లు మరియు రోజువారీ వార్తల నవీకరణలతో విశ్రాంతి తీసుకోవడం ఉన్నాయి. అదే విధంగా సమీక్షకు స్పందించిన వారిలో 11% మంది నిద్ర దినచర్యను అనుసరించడం కన్నా ‘ఏమీ చేయకుండా’ ఉండటానికి ఇష్టపడతారని తెలిపారు.
విధానం: Amazon Alexa ద్వారా కమిషన్ చేయగా, YouGov India ద్వారా ఈ సమీక్షను నిర్వహించింది. ఈ సర్వే ఫిబ్రవరి 2025లో 10 నగరాల్లో 1000 మందికి పైగా ప్రతివాదులతో ఆన్‌లైన్‌లో నిర్వహించారు. ఈ నగరాల్లో ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె, లక్నో, జైపూర్ మరియు అహ్మదాబాద్ ఉన్నాయి. అధ్యయనం పారామితులలో వయస్సు వర్గాలు, స్మార్ట్‌ఫోన్ మరియు స్మార్ట్ పరికరాల వినియోగం, స్మార్ట్‌ఫోన్‌లో వాయిస్ అసిస్టెంట్ వినియోగం మరియు సమీక్షకు స్పందించిన వారి నివాసాలలో జంటలు, జంటలు మరియు పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ ఉన్న గృహాలు మరియు ఒంటరి వ్యక్తులు ఉన్నారు.