నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని పెరికిట్ తెలుగు మీడియం ఉన్నత పాఠశాలలో మంగళవారం ఆర్ బి ఎస్ కే మెడికల్ హెల్త్ టీం డాక్టర్ రుబీనా షాహిన్ గారి పర్యవేక్షణలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం శ్రీనివాస్ సమక్షంలో పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటి సమస్య ఉన్న విద్యార్థులకు కళ్లద్దాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే టీం ఏఎన్ఎం జ్యోతి, ఫార్మసిస్ట్ రజిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.