
మండలంలోని మల్యాల గ్రామంలో శుక్రవారం సీసీ రోడ్డు పనులను మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేష్ పైలెట్ శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య సహకారంతో రోడ్డు పనులు ప్రారంభించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందుతాయని పలువురు కాంగ్రెస్ నాయకులు అన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సింగర్తి మల్లేష్, మాజీ సర్పంచ్ బిట్టు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షులు పోలగోని యాదగిరి, ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి శ్రీరాములు, మంచాల జంగయ్య, బిక్షపతి, మైలారం సుదర్శన్, గుండె నవీన్, రమేష్, మల్లేష్, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.