నేనున్నానని
నిస్సహాయ అభాగ్యుల చెంత నిలిచి
హాయి రాగాలు మీటి
మనసున వేయి వీణలు వినిపించ గల నీవు
సాహితీ లోకాన ఒక్కతివే నీవు కవితా రూపానివే!!
నేనున్నానని
నిస్తేజ శరీరాల నిరహంకార రాగాలని
నాట్య విన్యాసాలుగ మార్చి
తనువున చిరుజల్లులు కురిపించగల నీవు
సాహితీ ప్రియుల మదిలో అసలైన కలల రాణివే!!
నేనున్నానని
అంతిమ సమాజపు లక్ష్యాలే
సాహితీ జగత్తు విలువలని, సాక్ష్యాలని
ఉద్యమ ఊపిరిగ నిలిచి సమరాన పోరు బాటలు
నడిపించగల నీవు
సాహితీ ప్రపంచంలో సిసలైన కవిత్వపు ఉనికివే!!
– పి. మదుల, 7093470828