‘పోస్ట్‌ చేయని ఉత్తరం’

'పోస్ట్‌ చేయని ఉత్తరం'నవల అనుకుని తెచ్చుకున్నా. తీరా చూస్తే వ్యాసాలు. అయినా నవల లాగా చదివించింది ఈ పుస్తకం. ఇది అసాధ్యం కానీ సుసాధ్యం చేశారు రచయిత. ఆర్‌.శాంతి సుందరి గారు సరైన పుస్తకాన్ని అనువదించటానికి పూనుకున్నారని అర్థమైంది. మనిషి ఎదగటానికి పనికి వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే మోటివేటివ్‌ స్పీకర్లాగా పని చేస్తుంది. ఇందులో ఏముంది, ఏమిటి అని చెప్పే కంటే లోపలికి తొంగి చూసి ఆ అనుభూతిని సొంతం చేసుకుంటే నే పూర్తిగా అవగతమవుతుంది. మాటలకందని భావం ఎంతో ఉంది. ఇంతకంటే ఈ పుస్తకం గురించి నేనేమీ చెప్పలేను.
– యలమర్తి అనూరాధ,
9247260206

Spread the love