
మండలంలోని బంగారు పల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్మాణం చేస్తున్న సిసి రోడ్డు పనులను జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము ఆదివారం నాడు గ్రామాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాలలో సిసి రోడ్ల వలన గ్రామాల రూపురేఖలు మారుతున్నాయని, గతంలో వేసిన రోడ్లతో పాటు ఇప్పుడు వేసిన రోడ్లు కలిసి గ్రామమంతా సీసీ రోడ్లతో కలవడంతో అందంగా గ్రామాలు ముస్తాబవుతున్నాయని, అందుకే గ్రామాల అభివృద్ధి బాగుందని అందుకే గ్రామాల సందర్శన చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా సిసి రోడ్డు పనులను నాణ్యంగా నిర్మించాలని సంబంధిత గుత్తేదారునికీ ఆదేశాలు జారీ చేశామని లేకుంటే బిల్లులు నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు . ఈ గ్రామ సందర్శనలో ఎంపీడీవో తో పాటు ఎంపీ ఓ ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.