ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి

The state government should fix a fixed salary of Rs. 18,000/- for Ashas.– కాంగ్రెస్ సర్కార్ ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి
– పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలి
– మార్చ్ 24 న ఆశా వర్కర్ల సమస్యలపై చలో హైదరాబాద్ జయప్రదం చేద్దాం
– సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్
నవతెలంగాణ – కంఠేశ్వర్
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలి అని,కాంగ్రెస్ సర్కార్ ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీని అమలు చేయాలి అని, పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని, మార్చ్ 24 న ఆశా వర్కర్ల సమస్యలపై చలో హైదరాబాద్ జయప్రదం చేద్దాం అని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆశా వర్కర్ల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ ఆశ వర్కర్ల సమస్యల పైన మార్చ్ 24న హైదరాబాద్ జయప్రదం చేయండి జిల్లావ్యాప్తంగా ఆశ వర్కర్లు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ మార్చి 24న ఆశా వర్కర్ల చలో హైదరాబాద్ లో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. బిఆర్ఎస్ కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆశాల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదు. ఈ కాలంలో ఆశాలకు ఫిక్సిడ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరంచాలని కోరుతూ జిల్లా ఉన్నతాధికారులకు మరియు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితిలో ఆశాల సమస్యల పరిష్కారం కోసం మార్చి 24 చలో హైదరాబాద్ ఆశ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ 18000/లు బడ్జెట్ సమావేశాలలో నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సుకన్య , రేణుక, స్వప్న, రాధా, శోభ, గంగామణి, లలిత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love