
భగత్ సింగ్ రాజ్, రాజ్ గురు, శుక్దేవుల 94 వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆదివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలకుల దురాగతాలను వ్యతిరేకిస్తూ స్వయం పాలన సాధించాలని తిరుగుబాటు జెండాను ఎగరవేసి స్వాతంత్ర పోరాటంలో యువకులను ఉరూ తొలగించిన వ్యక్తి భగత్ సింగ్ అని 23వ సంవత్సరంలోనే భగత్ సింగ్కు ఉరిశిక్ష వేసినప్పటికీ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా సోషలిస్టు వ్యవస్థ ద్వారానే కుల మత వర్ణ వ్యవస్థ లేని దోపిడి రహిత సమాజం ఏర్పడుతుందని నినదించిన వ్యక్తి భగత్ సింగ్ అని తెలిపారు. భగత్ సింగ్ ఉరిశిక్షను రద్దు చేయాలని తన తండ్రి క్షమాభిక్ష కోసం అప్పీల్ చేస్తే దాన్ని నివారించి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని ఎదిరించటానికి ఉరిశిక్ష కైనా సిద్ధమే అని తెలిపారు. అందువల్లనే ఆయన స్ఫూర్తి నేటికి భారత ప్రజలకు ప్రధానంగా యువ లోకానికి స్ఫూర్తిదాయకంగా మారిందని ఆయన చిరస్మరణీయంగా మన గలిగారని తెలిపారు. కానీ నేటి పాలకులు సామ్రాజ్యవాద మరియు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడతా ఉంటే జాతీయ వాదం పేరు తోటి ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతూ అనైక్యతను సృష్టించాలని చూస్తున్నారని ఈ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలందరూ సమైక్యంగా తిరుగుబాటు చేసినప్పుడే ప్రజాస్వామ్యం మరియు లౌకికవాదం పరిరక్షించబడుతుందని సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు జిల్లా కమిటీ సభ్యులు సుజాత,సురేష్, విగ్నేష్ నాయకులు దీపిక, ఉద్ధవ్, శ్రీనివాస్, అబ్దుల్, శేఖర్ గౌడ్, ఇమామ్ దినేష్, రాజు,సుచిత్ తదితరులు పాల్గొన్నారు.