– బట్టుపల్లి అనురాధ..
నవతెలంగాణ – భువనగిరి
ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి భీమ్ యాత్రను యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో మహనీయుల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని బట్టుపల్లి అనురాధ బట్టు రామచంద్రయ్య తెలిపారు. బుదవారం జగ్జీవన్ రామ్ భవనంలో సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి భీమ్ యాత్రను జయప్రదం చేద్దాం అని అన్నారు. ఈ నెల 29 న మూడోవ సమావేశం జగ్జీవన్ రామ్ గారి భవనంలో సమీక్ష సమావేశం కలదన్నారు. ఈ కార్యక్రమంలో బండారు అశోక్ వర్ధన్, సిరిపంగా శివలింగం, ఇటుకల దేవేందర్, బానోత్ భాస్కర్ నాయక్, బర్రె నరేష్, నాగారం శంకర్, సిల్వర్ జైపాల్, అనంపట్ల కృష్ణ, దుబ్బ రామకృష్ణ, బాసాని మహేందర్, ఇంజ మహేష్, బొట్ల రమేష్, బట్టు మహేందర్, బుశపక మనీష్, సిర్పంగ చందు, అందె సాయి, కొల్లూరి రాజు, బొడ్డు కృష్ణయ్య, అనంపట్ల బాలస్వామి పాల్గొన్నారు.