నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల ప్రీమియర్ లీగ్-1(UPL)లో భాగంగా తాడూరు టైగర్స్ గురువారం జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్ సి బి ఉప్పునుంతల జట్టు కెప్టెన్ మధు గైక్వాడ్ ధనా ధన్ ఇన్నింగ్స్ చెలరేగాడు. కేవలం 19బంతుల్లో 4ఫోర్ల 3 సిక్సార్ల సాయంతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా ఘనంగా నిలిచాడు.తాడూరు టైగర్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత ఓవర్లలో 141/10(19.5) రాణించింది. చేజింగ్ బరిలోకి దిగిన ఆర్ సి బి ఉప్పునుంతల నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులతో ఘన విజయం సాధించింది. బరిలోకి దిగిన మధు గైక్వాడ్ స్కోర్ బోర్డు పరిగెత్తింది. ప్లేయర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సిరీస్ మధు గైక్వాడ్ కైవసం చేసుకున్నాడు. మధు గైక్వాడ్ కు క్రికెట్ అభిమానులు, యువత తదితరులు గెలుపు, మెరుపు పరుగులపై పలువురు వర్షం వ్యక్తం చేశారు.