నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్: జిల్లా ప్రజలకు నూతన సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. తెలుగు వారి పండుగలు ఉగాది పండుగతోనే మొదలవుతాయని, శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పండుగ సందర్బంగా ప్రజలందరి జీవితంలో ఉగాది పచ్చడి లా షడ్రుచులు నిండి ఉండాలని,ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో పండుగ ను ఆనందంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.