నవతెలంగాణ-భువనగిరి: తెలుగు నూతన విశ్వ వసు ఉగాది సంవత్సరంలో జిల్లా ప్రజల జీవితాల్లో కష్టాలు పోయి వెలుగును నింపే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొండమడుగు నరసింహ తెలిపారు.తెలుగు నూతన సంవత్సరం ప్రజా చైతన్యం, ప్రజా ఉద్యమాలు చేసి తమ సంవత్సర పరిష్కరించుకున్నందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.